calender_icon.png 18 November, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

18-11-2025 06:01:54 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడుపల్లి గ్రామంలో మంగళవారం తాడువాయి మండల ప్రత్యేక అధికారి రఘునందన్ ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రతి ఒక్కరు కచ్చితంగా ఇంటి నిర్మాణాలు చేపట్టుకోవాలని సూచించారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, ఎంపిఓ, గ్రామపంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.