18-11-2025 06:10:38 PM
వలిగొండ (విజయక్రాంతి): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వలిగొండ మండల కమిటీని యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ అధ్యక్షుడు బందారపు లింగస్వామి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ కమిటీలో అధ్యక్షుడిగా వైవిఎన్ రెడ్డి, కార్యదర్శిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం లింగస్వామి మాట్లాడుతూ ఉపాధ్యాయులు దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు పరిరక్షించడం కోసం పరితపించాలని పిలుపునివ్వడం జరిగింది.
కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు వైవిఎన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రావలసిన పెండింగ్ డిఏలు, పిఆర్సిని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు పొట్లపల్లి స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఉక్కుర్తి లక్ష్మణ్, గోపి, శ్రీధర్, సంజీవ, ప్రవీణ్, లక్ష్మారెడ్డి, వేణు రెడ్డి, వెంకటేశం, రమణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.