25-04-2025 02:24:49 AM
కాటారం (భూపాలపల్లి), ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల పెద్ద ఆసుపత్రిలో గురువారం అరుదైన ఆపరేషన్ చేసి రికార్డ్ సృష్టించింది. ఈ మేరకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కోడూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ... రొమ్ము క్యాన్సర్ కు సంబంధించిన వ్యక్తులకు ఆపరేషన్ చేయనున్నట్లు తెలిపారు. అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరాలు వెల్లడించారు. లెఫ్ట్ బ్రెస్ట్ కార్స్ కోమా క్యాన్సర్ కు మత్తుమందు ద్వారా ఆపరేషన్ విజయవంతం చేయడం జరిగిందని చెప్పారు.
గురువారం సాయంత్రం నాలుగు గంటల 54 నిమిషాలకు భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీకి చెందిన అల్లూరి రాధ (40) కు ఆపరేషన్ చేయడం జరిగిందని తెలిపారు. సి ఎస్ ఆర్ పథకం కింద శస్త్ర చికిత్స వైద్య పరికరాలు అందించడం వల్ల ఆపరేషన్లు చేయడానికి అనుకూలత ఏర్పడిందని, పరికరాలు అందించినందుకు గాను ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆపరేషన్ వైద్య బృందంలో డాక్టర్లు జనరల్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ రఘు, అనేస్తేషియా ప్రొఫెసర్ హెచ్‌ఓడి డాక్టర్ నాగార్జున రెడ్డి, జనరల్ సర్జన్లు డాక్టర్లు శ్రీకాంత్, కీర్తి, స్వరూప్, అక్షిత, శ్రీవాణి, దివ్య, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు బిక్షపతి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.