calender_icon.png 3 May, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహంకాళీ ఆలయ నిర్మాణ శంకుస్థాపన

25-04-2025 02:21:57 AM

హనుమకొండ, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): హసన్ పర్తి పట్టణ కేంద్రంలో గల ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జీర్ణోదర, నూతన ఆలయ నిర్మాణం కొరకు శంకుస్థాపన పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూరోహితులు దహగం రమేష్ శర్మ మాట్లాడుతూ వాస్తు కు విరుద్ధంగా ఆలయం ఉండడం మూలంగా గ్రామం యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయ పునర్నిర్మాణం చేయడం జరుగుతుందని దాతలు ముందుకు వచ్చి వారి సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తూ, ఈ కార్యక్రమం విజయవంతమైయ్యేటట్టు చూడవలసిన బాధ్యత ప్రజలపై ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా హసన్ పర్తి 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని, గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి పూనుకున్నట్టు తెలియజేశారు.

గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పిట్టల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి జన్ను కిషన్ లు సంయుక్తంగా మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందిన హసన్ పర్తి అనుకున్నంతగా అభివృద్ధి చెందడం లేదని ప్రజలు ఆవేదనతో ఉన్నారని గ్రామ దేవతలను కొలుచుకోవడం వల్ల వాస్తు ప్రకారం దేవాలయం నిర్మాణం, ఉజ్జయిని మహంకాళి, హనుమాన్, శివుడు, కాలభైరవుడు మొదలగు దేవతలను పునర్ప్ర తిష్టాపించుకోవడం వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారని తెలియజేస్తూ గ్రామ ప్రజల దాతల సహాయ సహకారంతో ఆలయ నిర్మాణానికి పూనుకున్నామని, హసన్ పర్తి బొడ్రాయి పునర్ ప్రతిష్టాపన కూడా నవంబర్ 24, 25, 26 తేదీలలో నిర్వహించబడుతుందని తెలియజేశారు.

పెద్ద మనసుతో ప్రజలందరూ సహకరించి ఆలయ నిర్మాణము,బొడ్రాయి పునర్ ప్రతిష్టాపన విజయవంతానికి కృషి చేయాలని వేడుకున్నారు. అభివృద్ధి కమిటీ సభ్యులు,ముదిరాజ్ కుల సంఘం అధ్యక్షులు శీలం పృథ్వీరాజ్ యాదవ సంఘం అధ్యక్షుడు మారం సుధాకర్ డివిజన్ బిఆర్‌ఎస్ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్,రజక సంఘం అధ్యక్షులు గోపరాజు ఉదయ్ కుమార్,చేనేత పారిశ్రామిక సంఘం అధ్యక్షులు మాటేటి భాస్కర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చకిలం రాజేశ్వరరావు,గాంధీనగర్ అధ్యక్షులు దీకొండ బిక్షపతి, కుల సంఘాల పెద్దలు , నాయకులు పాల్గొన్నారు.