calender_icon.png 22 October, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

97 ఏళ్ల వృద్ధుడికి అరుదైన శస్త్ర చికిత్స

22-10-2025 12:06:55 AM

మేడ్చల్, అక్టోబర్ 21(విజయ క్రాంతి): మూత్రాశయ సమస్యతో బాధపడుతున్న 97 ఏళ్ల వృద్ధుడికి మెడిసిటి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అజీజ్ అనే రోగి మూత్రశయం నుంచి మూత్రం వెలుపలికి వచ్చే ద్వారానికి అడ్డంకులు ఏర్పడడంతో మేడిసిటీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు దీనిని ప్రోస్టాటిక్ హైపర్ ప్లాసియా అనే వ్యాధిగా నిర్ధారించారు. దీనిని సరి చేయడానికి టియుఆర్‌పి అనబడే శస్త్ర చికిత్స చేయాలి.

అయితే రోగి వయస్సు కారణంగా సర్జరీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ యూరాలజిస్ట్ డాక్టర్ నితేష్ బృందం తగు జాగ్రత్తలు తీసుకొని సర్జరీ విజయవంతం చేశారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోరుకున్నాడు. రోగి వయసు రిత్యా సర్జరీ సమయంలో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అన్ని జాగ్రత్తలు తీసుకొని సర్జరీ చేశామని డాక్టర్ నితేష్ తెలిపారు. శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని ఎంఐఎంఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కే శివరామ కృష్ణ, సీఈవో ఐనిస్ మర్చంట్, మెడికల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ గీత, యూనిట్ హెడ్ డాక్టర్ సల్మాన్ సాదిక్ తదితరులు అభినందించారు.