9 May, 2026 | 2:19 PM

Breaking News

ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం   •   మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •  

శ్రీనివాస మంగాపురం నుంచి మంగ వచ్చింది!

31-01-2026 01:36 AM

‘ఆర్‌ఎక్స్100’, ‘మంగళవారం’ చిత్రాల ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మరో కొత్త ప్రాజెక్ట్ ‘శ్రీనివాస మంగాపురం’. జయకృష్ణ ఘట్టమనేని వెండితెరకు పరిచయం అవుతున్న ఈ చిత్రంతోనే బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ ప్రాజెక్టును సమర్పిస్తుండగా, చందమామ కథలు బ్యానర్‌పై పీ కిరణ్ నిర్మిస్తున్నారు. టైటిల్ రివిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలేర్పడ్డాయి.

తాజాగా శుక్రవారం ఈ చిత్రం నుంచి కథానాయకి రషా థడానీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఆమెను ‘మంగ’ పాత్రలో పరిచయం చేస్తూ విడుదల చేసిన మోషన్ పోస్టర్‌లో రషా సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంది. ఇటీవలే 30 రోజుల భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండో షెడ్యూల్ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; డీవోపీ: జయకృష్ణ ఐఎస్‌సీ; యాక్షన్: రియల్ సతీశ్; ఎడిటర్: మాధవ్ కుమార్ గుల్లపల్లి; ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేశ్.