9 May, 2026 | 1:09 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

వారణాసి డేట్ చెప్పేశారహో!

31-01-2026 01:38 AM

ప్రస్తుతం సినీప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల్లో ‘వారణాసి’ ఒకటి. మహేశ్‌బాబు, ఎస్‌ఎస్ రాజమౌళి కలిసి తొలిసారి చేస్తున్న సినిమా ఇది. శ్రీదుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి వార్త సంచలనం సృష్టిస్తోంది.

దర్శకుడు రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్స్‌ను తనదైన రీతిలో చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం వారణాసి నగరం అంతటా ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్లు, బ్యానర్లు ఆకస్మికంగా కనిపించడంతో దేశవ్యాప్తంగా అనేక చర్చలు నడిచాయి. ఈ విషయాన్ని నిర్మాతలు శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించారు. ఈ మేరకు రాజమౌళి, మహేశ్‌బాబుతోపాటు మిగతా తారాగణం, మూవీ సిబ్బంది అంతా సోషల్‌మీడియాలో పోస్టర్‌ను పంచుకోవటం ద్వారా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వారణాసి 2027, ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానుంది.