27-10-2025 04:53:04 PM
నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్మల్ జిల్లా మహిషా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ స్టాచు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏబీవీపీ నిర్మల్ జిల్లా కన్వీనర్ మూడపెళ్లి దినేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 8900 కోట్ల స్కాలర్‌షిప్ పెండింగ్లో ఉంది.. గత తొమ్మిది సంవత్సరాలైనా కూడా ఈ యొక్క స్కాలర్‌షిప్‌లను విడుదల చేయడం లేదు.. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయాలేని పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. ఇప్పటికైనా మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ఎంత పెద్ద ఉద్యమానికైనా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు విభాగ్ SFD కన్వీనర్ గంగా ప్రసాద్, నగర హాస్టల్స్ కన్వీనర్ సంతోష్, గంగారెడ్డి, ఓంకార్, ప్రకాష్, యోగేష్, శ్రీధర్, ముత్యం, తదితరులు పాల్గొన్నారు.