calender_icon.png 1 August, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ రేషన్ కార్డులు

31-07-2025 12:19:32 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

 మాడ్గుల, జులై 30 : అర్హులైన అందరికీ రేషన్ కార్డు అందుతాయని, కార్డులు రానులు ఎవరు ఆందోళనకు గురి కావోద్దని రేషన్ కార్డులది నిరంతర ప్రక్రియ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీని ఇచ్చారు. బుధవారం మాడుగుల మండలంలో నూతనంగా మంజూరైన 666 లబ్ధిదారులకు రేషన్ కార్డులను, 8 కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం హామలు చేస్తుందని ఆయన చెప్పారు.

రైతులు సంప్రదాయ పంటలను పండిస్తూనే లాభదాయక పంటలపై దృష్టి సారించాలని ఆయిల్ ఫామ్ మ్ పంట ను సాగు చేసి ప్రభుత్వం అందిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకొని దీర్ఘ కాలిక లాభాలను పొందాలని రైతులకు సూచించారు.కే ఏ ల్ ఐ పనులు ఊపొందుకున్నాయని..... త్వరలోనే డి -82 కాల్వల ద్వారా మండలంలోని చివరి ఆయకట్టు నాగిళ్ళ వరకు సాగునీరు పారుతుందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి పైసలకు ఏమైనా లాలూచీ పడితే అట్టి అధికారులపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరింఛారు.

యూరియా కొరత ఎక్కడ లేదని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మొద్దని మీకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. అక్కడి నుంచి ఆమనగల్ మండలంలో ఆయన పర్యటించి శెట్టిపల్లి గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించే ఐదువేల ఆర్థిక సాయం అందజేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా అమంగల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

రోడ్డు పనులను మరింత వేగంగా చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి, మాజీ ఎంపీపీ జంగయ్య, విజయ డైరీ చైర్మన్ బొజ్జ సాయి రెడ్డి, తాసిల్దార్ వినయ్ సాగర్, ఇన్చార్జి ఎంపీడీవో వెజన్న, సింగిల్ విండో డైరెక్టర్ జగన్, మార్కెట్ డైరెక్టర్లు పల్లె జంగయ్య గౌడ్, యాదయ్య గౌడ్, జెల్ల రమేష్, మాజీ ఎంపీటీసీ కొత్త పాండు గౌడ్, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కోదండ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ కాట్ల యాదయ్య గౌడ్, ఓం ప్రకాష్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మిద్దె రాములు ,అందుగుల రాజు, నవీన్ గౌడ్, కిషన్ నాయక్, జైపాల్ నాయక్ తదితరులు ఉన్నారు.