31-07-2025 12:20:55 AM
ఘట్ కేసర్, జూలై 30: ఘట్ కేసర్ మున్సిపల్ ఎదులాబాద్ లో మంగళవారం రాత్రి శ్రీగోదాసమేత శ్రీమన్నారు.రంగనాయకస్వామి వారి రథోత్సవం అత్యంత వై భవంగా కన్నులపండువగా జరిగింది. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జెడ్పి చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వారు స్వామి వారి రథోత్సవాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు ప్ర ముఖులు రావడంతో గ్రామస్థులు డప్పు వాయిధ్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలోకి ఆలయ ధర్మకర్తలు పోశెట్టి లక్ష్మణాచార్యులు. పురుషోత్తమాచార్యులు, గోవిందరాజులు, శే షాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి నిత్యజీవిత కార్యక్రమాలతో పాటు దైవకార్యక్రమాలలో కూడా పాల్గొనాలని అన్నారు. ఈ సందర్భంగా అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. గ్రా మంలోని ప్రధాన వీధులగుండా స్వామివారి రథోత్సవానికి భక్తులు అడుగడుగునా హారతులు పట్టారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఘట్ కేసర్ సీఐ పరశురాం గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.