15-10-2025 01:32:49 AM
-ఏర్పాటు చేసిన విత్తనాల కంపెనీ యాజమాన్యం
-14 మంది మహిళలు, 50 మంది ఉద్యోగులు, డీలర్లు హాజరు
-పోలీసుల అదుపులో పలువురు
మహేశ్వరం, అక్టోబర్ 14: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గట్టుపల్లి సమీపంలోని కే చంద్రారెడ్డికి చెందిన ఫామ్ హౌస్‌లో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఒక విత్తనాల కంపెనీ యాజమాన్యం తమ సంస్థ ఉద్యోగులు, పలువురు డీలర్లను తమ వ్యాపార కార్యకలాపాలలో మచ్చిక చేసుకొనేందుకు పార్టీ ఏర్పాటు చేసింది. పార్టీలో 14 మంది మహిళలతో పాటు 50 మంది ఉద్యోగులు డీలర్లు పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించి రేవ్ పార్టీని భగ్నం చేశారు. రేవ్‌పార్టీలో పాల్గొన్న పలువురుని అదుపులోకి తీసుకొని మహేశ్వరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పార్టీలో మద్యం ఏర్పాటు చేయడంతో పాటు మహిళలు ఉండటం, పార్టీకి ఎలాంటి అనుమతి లేకపోవడంతో పోలీసులు నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.