calender_icon.png 15 October, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు?

15-10-2025 12:42:00 AM

  1. బీఆర్‌ఎస్‌ని గెలిపిస్తారా, కాంగ్రెస్‌నా?
  2. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ప్రశ్నించిన రాజాసింగ్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మంగళవారం చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. “జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు? జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. బీఆర్‌ఎస్‌ని గెలిపిస్తారా, కాంగ్రెస్‌ని గెలిపిస్తారా అని సోషల్ మీడియాలో జనా లు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.

జూబ్లీహిల్స్ మీ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకే వస్తుం ది. మీ గౌరవం ప్రమాదంలో ఉంది. భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర పెద్దలకు ముఖం ఎలా చూపెడతారు? కొంచెం ఆలోచించారా?” అని కిషన్‌రెడ్డిని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. “నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారు, ఏదో ఒకరోజు మీరు కూడా వెళ్లడం ఖాయం” అని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. “ప్రతి నియోజకవ ర్గంలో వేలుపెట్టడం మీకు అలవాటు.

నా జిల్లాను సర్వనాశనం చేసి, నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారు. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఏదో ఒకరోజు బయట కు వెళ్ల డం పక్కా” అని రాజాసింగ్ వ్యాఖ్యానించా రు. కాగా, కిషన్‌రెడ్డి, రాజాసింగ్‌ల మధ్య విభేదాలు కొత్తేమీ కాదు. గతంలోనూ పలు సం దర్భాల్లో వారి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ మరోసారి ఈ విభేదాలు బహిర్గతం కావడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.