15-10-2025 01:01:58 AM
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనక చర్ల ప్రాజెక్టును ఆపే ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వానికి ఉందా, లేదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా మంగళవారం నిలదీశారు. అనుమతులు ఇవ్వొద్దం టూ కేంద్ర మంత్రికి ఇప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాయకపోవడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. అక్టోబర్ 6న ఏపీ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్పటికీ దాన్ని అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రికి సీఎంగానీ, ఇరిగేషన్ శాఖ మంత్రిగానీ ఇప్పటివరకు ఎందుకు ఉత్తరం రాయలేదు అని ప్రశ్నించారు.
ఇదే విషయంలో తెలంగాణ ఇరిగేషన్ సెక్రెటరీ, ఎం దుకు కేంద్ర జలశక్తి సెక్రటరీకి ఉత్తరం రాయ డం లేదు అని ప్రశ్నించారు. పాత తేదీలు వేసి, ఈఎన్సీతో ఉత్తరం రాయిస్తే ఏం లాభం అని ప్రశ్నించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టు కట్టేందుకు వేగంగా ముందుకు కదులుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలం గాణ ప్రజలను పాత తేదీల లేఖలతో మభ్య పడుతోందని ఆరోపించారు.
గోదావరి నదీ జలాలను వరద జలాల పేరిట తరలించేందుకు తలపెట్టిన ఏపీ అక్రమ ప్రాజెక్టు బనక చర్ల విషయంలో రాష్ర్ట ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందన్నారు. తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్‌మీట్ నిర్వహించి కాంగ్రె స్ ప్రభుత్వాన్ని నిలదీస్తే.. మూడు రోజుల తర్వా త పాత తేదీతో లేఖ విడుదల చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
కర్ణాటక కాంగ్రెస్, ఆంధ్రా టీడీపీ, మహారాష్ర్ట బీజేపీ ప్రభుత్వాలు గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటా ను కొల్లగొట్టేందుకు కుట్ర లు చేస్తుంటే రేవంత్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కుళ్లు రాజకీయాలు మాని తెలంగాణ ప్రయోజనాల కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి, తెలంగాణ నీటి హక్కులు కాపాడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి న్యాయ పోరాటం చేయాలని హరీశ్‌రావు హితువు పలికారు.
కాంగ్రెస్ పాలనలో కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పుకూలుతోందని, మూడు నెలలు నెగిటివ్ ద్రవ్యోల్బణం పాలన వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, ఆర్థిక నిర్వహణలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయ్యిందని మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక నిర్వహణలో ఘోర వైఫల్యం వల్ల రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందన్నారు.
దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైతే, తెలంగాణలో నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు అవుతుండటం మందగించిన ఆర్థిక పతనానికి సంకేతంగా నిలుస్తున్నదని వెల్లడించారు. జూన్- శాతం, జూలై శాతం, సెప్టెంబర్ శాతాలతో వరుసగా నాలుగు నెలల్లో ఈ మూడు నెలలు డిఫ్లేషన్ నమోదు కావ డం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నా రు.
తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత రుణాత్మక ద్రవ్యోల్బణం మూడు సార్లు నమోదు కావడం ఇదే మొదటి సారి అన్నా రు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యం లో సాధారణంగా వినియోగం పెరిగి, పాజిటివ్ ద్రవ్యోల్బణం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కానీ, నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు కావడం రాష్ర్ట ఆర్థిక విధానాల ఫెయిల్యూర్ అన్నారు.