15-10-2025 01:43:57 AM
ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తాం
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ప్రాజెక్టును పూర్తి చేసి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచి వాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వ హించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. పాలనా పరమైన అడ్డంకులు తొలగించి నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తిచేయాలనే సంక ల్పంతో ప్రభుత్వం ఉన్నదని, అందుకు అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 5.56 లక్షల ఎకరాలకుగాను ఇప్పటి వరకు 3.17 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, భూగర్భ జలాలతో సాగులో ఉన్న 58,028 ఎకరాలను కలుపుకుంటే మొత్తం ఆయకట్టు 6.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు.
సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.18,500 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.14,269.63 కోట్లు ఖర్చు అయ్యాయని వివరించారు. 2,430 కి.మీ.ల మేర కాలువలు తవ్వాల్సి ఉండగా.. 1,663.10 కి.మీ. కాలువల తవ్వకం పూర్తయ్యిందని, 702.62 కి.మీ.ల పైప్‌లైన్ కుగాను 669.66 కి.మీ.ల వరకు పూర్తయ్యిందని, కాలువ లైనింగ్ 799.80 కి.మీ.లు పూర్తి అయ్యిందని చెప్పారు.
దేవాదుల ప్రా జెక్టు పరిధిలో 46 ట్యాంక్‌లకు 39 పూర్తయ్యాయని, 21 పంప్‌హౌజ్‌లలో 18 పూర్త య్యాయని, గణాంకాలన పరిశీలిస్తే వివిధ విభాగాల్లో 67 శాతం నుంచి 95 శాతం వరకు పనులు పురోగతిలో ఉన్నాయని మం త్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు మొదటి దశలో 170 రోజులపాటు 5.18 టీఎంసీల నీటిని పంపింగ్‌చేసి.. 1.23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. రెండో దశలో 7.25 టీఎంసీల నీటితో 1.83 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో పనులను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు.
34,386 ఎకరాలకుగాను 32,079 ఎకరాల భూమిని సేకరించామని, మిగిలిన 2,307 ఎకరాల భూసేకరణ మిగిలిందని పేర్కొన్నారు. ఇది ప్రధానంగా మూడో దశ ప్రాజెక్టులో ఉందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, లైనింగ్, మెకానికల్ పనులను పూర్తిచేస్తామని చెప్పారు. వచ్చే రెండేండ్లలో దేవాదులను పూర్తిచేసి ప్రాజెక్టులో ఆయకట్టును స్థిరీకరిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ఉత్తర, మధ్య తెలంగాణ రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తుందని మంత్రి ఉత్త మ్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎంపీ పొరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు నాగరాజు, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనా రాయణరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సాగునీటి సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.