బజాజ్ ఫైనాన్స్ ఈకామ్‌పై నియంత్రణలు ఎత్తివేత
03-05-2024 12:02 AM
ఇన్‌స్టా ఈఎంఐ కార్డుపై కూడా
ముంబై, మే 2: బజాజ్ ఫైనాన్స్ ఈకామ్ విభాగం, ఆన్‌లైన్ డిజిటల్ ‘ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్’పై రిజర్వ్‌బ్యాంక్ గతంలో విధించిన నియంత్రణలను ఎత్తివేసింది. ఈ విషయాన్ని గురువారం కంపెనీ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. తక్షణమే ఇది అమలులోకి వస్తుందన్న ది. ఈ కామర్స్ వ్యాపారం కోసం బజాజ్ ఫైనాన్స్ ఈకామ్ రుణాలిస్తుంది. కొద్ది నెలల క్రితం నియంత్ర ణలు విధించిన తర్వాత బజాజ్ ఫైనాన్స్ చేపట్టిన నష్టనివారణా చర్యలతో తాజా ఆర్బీఐ నిర్ణయం వెలువ డింది. ఈ రెండు వ్యాపార విభాగాల్లోనూ రుణ మంజూరీలు, పంపి ణీలు ప్రారంభించనున్నది. అలాగే ఈఎంఐ కార్డులను సైతం కొత్తగా జారీచేస్తుంది.






