10 July, 2026 | 12:38 AM

బీవోబీ ‘బాబ్ వరల్డ్’ యాప్‌పై నియంత్రణలు ఎత్తివేత

09-05-2024 12:22 AM

ముంబై, మే 8: బ్యాంక్ ఆఫ్ బరో డా (బీవోబీ) బాబ్ వరల్డ్ యాప్‌పై రిజర్వ్‌బ్యాంక్ నియంత్రణ ల్ని ఎత్తివేసింది. పర్యవేక్షణా ఆందోళనల కార ణంగా ఈ యాప్‌లో కొత్త ఖాతాదారులను చేర్చుకోకుండా 2023 అక్టో బర్‌లో ఆర్బీఐ నిషేధం విధించింది. తాజాగా ఆ నిషేధాన్ని ఆర్బీఐ తొలగించిందని, బాబ్‌వరల్డ్ యాప్‌లో కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి అనుమతి ఇచ్చిందని బుధవారం బీవోబీ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.