13 July, 2026 | 7:29 AM

ఆర్బీఐ చెంతకు 98 శాతం రెండు వేల నోట్లు

03-05-2024 12:07 AM

ముంబై, మే 2:  ఏడాది క్రితం ఉపసంహ రించిన రూ.2000 నోట్లలో 97.76 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వ్‌బ్యాంక్  తెలిపింది. అయితే పబ్లిక్ వద్ద ఇంకా రూ.7,961 కోట్ల విలువైన రెండు వేల నోట్లు ఉన్నాయని గురువారం ఆర్బీఐ వెల్లడి ంచింది. 2023 మే 19న చెలామణీ నుంచి రూ.2,000 నోట్లను ఆర్బీఐ ఉపసంహరిం చింది. ఆ రోజునాటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు సర్క్యులేషన్‌లో ఉన్నాయి. అవి 2024 ఏప్రిల్ 30 నాటికి రూ.7,961 కోట్లకు తగ్గాయని కేంద్ర బ్యాంక్ తెలిపింది.

ఇంకా డిపాజిట్ చేసే అవకాశం

ఇంకా రూ.2,000 నోట్లకు లీగల్ టెండర్ ఉన్నది. వాటిని దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు డిపాజిట్ చేయవచ్చు. మార్పిడి చేసుకోవచ్చు.అలాగే ఏ పోస్టాఫీసు నుంచైనా ఆర్బీఐ కార్యాలయాలకు ప్రజలు రూ.2000 నోట్లను పోస్టు చేయవ చ్చు. వాటిని వారి బ్యాంకు ఖాతాల్లో ఆర్బీఐ  జమ చేస్తుంది. వీటిని సాధారణ బ్యాంక్ శాఖల్లో మార్పిడి చేయడం, డిపాజిట్ చేసుకోవడాన్ని 2023 అక్టోబర్‌లో  నిలిపివేశారు. అప్పటి నుంచి ఈ సదుపాయం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాలకే పరిమితం చేశారు. 2016 నవంబర్‌లో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసిన తర్వాత రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.