calender_icon.png 17 May, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఆర్సీ అమలు కోసం కార్యాచరణకు సిద్ధం

17-05-2025 12:00:00 AM

మందమర్రి, మే 16: సింగరేణిలో పని చేస్తున్న అధికారులకు క్రమం తప్పకుండా రావాల్సిన పీఆర్సీని ఇవ్వకపోవడంతో అధికారులందరూ తదుపరి కార్యాచరణకు సిద్ధం కావాలని సీఎంఓఏఐ సింగరేణి బ్రాం చ్ కార్యదర్శి పి నరసింహులు, ఉపాధ్యక్షుడు పి శ్రీనివాస్, రామగుండం 1 ఏరియా ఉపాధ్యక్షుడు పి శ్రీనివాస్‌లు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో సీఎం ఓఏఐ ఏరి యా అధ్యక్షుడు రమేష్, బెల్లంపల్లి ఏరియా అధ్యక్షుడు ఎం నరేందర్‌ల ఆధ్వర్యంలో సిఎంఓఏఐ అత్యవసర సమావేశం నిర్వహించగా, ఈ సమావేశానికి వారు హాజర య్యారు.

ఈ సమావేశంలో 2022 పీఆర్సీ గురించి చర్చించి, చాలా కాలం నుం డి పెండింగ్లో ఉన్న పీఆర్సీ ఇప్పటికి ప్రభు త్వం నుండి అనుమతి రాకపోవడంలో జరుగుతున్న జాప్యంతో అధికారులు తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీ అమలుకు కార్యాచరణలు చేపట్టాలని, ప్రణాళికలు సిద్ధం చేయాలని సమావేశాల్లో తీర్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఎంఓఏఐ ఏరియా ఉపాధ్యక్షుడు నాగవర్ధన్, జాయింట్ కార్యదర్శి నరేష్, రవి, సంతో ష్, బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి వీరన్న, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.