17-05-2025 12:00:00 AM
నిర్మల్, మే 16 (విజయక్రాంతి): నిమ్మల నాడు నిర్మించిన నిర్మల్ గొలుసుకట్టు చెరువుల్లో ఈ సంవత్సరం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి కరువు ఏర్పడుతుంది. ప్రతియుట నిండుకుండల్ల నీటి సామర్థ్యాన్ని కలిగి ఉన్న కొలుసు చెరువులు ఈ సంవత్సరం తీవ్రమైన ఎండలు భూగర్భ జలాల వినియోగం కారణంగా రోజురోజుకు చెరువులు నీటి పరిణామం తగ్గిపోవడంతో రైతులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నిర్మల్ పట్టణంలోని బంగల్పేట చెరువు ను మొదలుకొని కంచరౌడీ కట్ట వరకు పల్లె చెరువును మొదలుకొని మోతీతలాపురపు మొత్తం 13 గొలుసు చెరువులను తిమ్మన్నాయుడు కాలంలో నిర్మించారు. 400 ఏళ్లకు క్రితం నిర్మించిన ఈ గొలుసు కట్టు చెరువు లో ఇప్పటివరకు ఎన్నడు కూడా ఈ స్థాయి లో నీటి నిలువలు పడిపోలేదని పట్టణవాసులు పేర్కొంటున్నారు.
పట్టణంలోని అతి పెద్ద చెరువు అయినా బంగల్పెట్ వినాయకసాగర్ చెరువుతోపాటు కురన్నపేట వెంకటాద్రిపేట్ మోతీతలాబ్ ఇబ్రహీం కుంట, కంచ రుని కట్ట ధర్మసాగర్ పల్లెచెరువు, సుఫీనగర్ చెరువు, మంజులాపూర్ చెరువు తదితర చెరువులో నీటి సామర్థ్యం గణనీయంగా తగడంతో ఎడారిగా తలపిస్తున్నాయి. ఎన్ని కరువుకాటకలు వచ్చినా నిర్మల్ పట్టణంలోని ప్రధాన చెరువులు ఎప్పుడూ నీటితో కళకళలాడేవని కానీ ప్రస్తుతం చెరువులు నీటి పరిణామం తగ్గడంపై భవిష్యత్తులో వర్షాలు గురవకపోతే నీటి కష్టాలు ఎదురవుతాయని పట్టణవాసులు పేర్కొంటున్నారు.
చెరువుల కింద ఆయకట్టు సాగు చేసే రైతు లు కూడా పంటలు సాగు చేసుకోవడానికి ఇబ్బంది కలగవచ్చు. కొన్ని చెరువుల్లో అక్రమాలు జరగడం ప్లాట్లుగా మార్చడం వ్యర్థ పదార్థాలు పడి వేయడం పూడిక తీయకపోవడం రిపేర్లు చేయకపోవడంతో చెరువుల్లో నీటి సామర్థ్యం తగ్గినప్పటికీ ఎండల కారణం గా ఉన్న మీరు కూడా ఇంకిపోవడంతో ముఖ్యంగా మత్స్య కార్మికులు చేపలు చనిపోతాయేమో అన్న భయం నెలకొంది.
గొలు సుకట్టు చెరువుల్లో నిర్మల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామానికి చెందిన మత్స్య కార్మికులు చేప పిల్లలను చెరువుల్లో పెంచి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఏడాది పా టు కుటుంబాన్ని పోషించుకుంటారు. అయి తే చెరువులో నీటి పరిణామం తగ్గడం వ్యర్ధా లు ఎక్కువగా రావడంతో చేపలు వృద్ధి చెందక ఉన్న చేపలకు నీరు సరిపోక చేపల పరిణామం పెరగపోవడంతో దిగుబడులపై ఆందోళన చెందుతున్నారు.
ప్రతి సంవత్సరం మే మాసంలో నీటితో కళకళలాడే బంగల్పేట చెరువు కోరన్నపేట్ మోతి తలాబ్ చెరువులో కూడా నీటి శాతం తగ్గిపోయి మైదానాన్ని తలపిస్తున్నాయి. నిర్మల్ చుట్టూ గొలుసుకట్టు చెరువులు ఉండటం వలన ఇప్పటివరకు పట్టణంలో భూగర్భ జలాల కొరత రాలేదని పట్టణవాసులు పేర్కొంటున్నారు. పట్టణంలో చెరు వుల కారణంగా ఏ ప్రాంతంలోనైనా పది నుంచి 15 మీటర్లలోపు బోరువేస్తే నీరు పుష్కలంగా పడదని ఇప్పుడు 30 మీటర్ల వరకు పోరు వేయవలసి ఉంటుందని పట్టణవాసులు పేర్కొంటున్నారు.
శివారు కాల నీలైన ఆదర్శనగర్ వైయస్సార్ కాలనీ గాజులపేట్ సోఫీ నగర్ శాంతినగర్ రాంనగర్ సాగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో బోర్ల నుం చి నీరు రాకపోవడంతో వచ్చే నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం నిర్మల్ చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువుల్లో నీటి లభ్యత తగ్గిపోవడమే కారణమని అధికారు లు పేర్కొంటున్నారు.
నీటి పొదుపుగా వినియోగించుకోండి
భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యం లో ప్రజలు ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా భూగర్భ జల శాఖ అధికారి శ్రీనివాస్ బాబు తెలిపారు. భూగర్భ జిల్లాల పరిరక్షణకు ప్రతి ఒక్క రూ బాధ్యతగా తన ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు.
నీరును అధికంగా వినియోగించడం వల్ల భవిష్యత్తులో నీటి కొడత ఏర్పడి ప్రజలు ఇబ్బంది గురి అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా జల సంరక్షణలో భాగస్వాములై ఆరోగ్య జీవించాలన్నారు.నిర్మల్ పట్టణంలో నీరు లేక వేలవెలబోతున్న గొలుసు కట్టు చెరువులు