16-05-2025 11:01:08 PM
సమస్యల పరిష్కారానికి హామీ
కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం 4-ఇంక్లైన్ గ్రామపంచాయతీలోని పల్లె క్రీడా ప్రాంగణంలో నెలకొన్న సమస్యలను, తెలుసుకునేందుకు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ శుక్రవారం 4-ఇంక్లైన్ గ్రౌండ్ ను పరిశీలించారు. ఇళ్లలో నుండి డ్రైనేజీ వాటర్ నేరుగా గ్రౌండ్ లోకి రావడం వల్ల ఇబ్బందిగా ఉందని స్థానిక యువత ఆయన ద్రుష్టికి తీసుకువచ్చారు. 50 సంవత్సరాలు పైగా చరిత్ర కలిగిన గ్రౌండ్ ఇప్పుడు ఆడుకునేందుకు తీవ్ర ఇబ్బందిగా ఉందని యువకులు చేసిన విజ్ఞప్తి మేరకు సమస్యలు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వారి దృష్టికి తీసుకువెళ్లి, వెంటనే డ్రైనేజీ సమస్య క్లియర్ చేసి గ్రౌండ్ కి కావాల్సిన మరిన్ని వసతులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా గ్రామ యువత ఐవైసీ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, అసెంబ్లీ అధ్యక్షులు పాల సత్యనారాయణ రెడ్డి లను శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ పల్లి ప్రణయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ లు, కసనబోయిన రామ్మూర్తి, తాటి పవన్, చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతడుపుల శివ ఉపాధ్యక్షుడు మాలోత్ శివ, గుంటి కుమారస్వామి మరియు కొత్తగూడెం టౌన్ వైస్ ప్రెసిడెంట్ సాయి ప్రకాష్, 4-ఇంక్లైన్ గ్రామపంచాయతీ యువజన కాంగ్రెస్ నాయకులు మారేపల్లి రాకేష్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దినేష్ గౌడ్, భూక్యా శంకర్ మరియు 4-ఇంక్లైన్ యూత్ తానంగి ప్రవీణ్, వజ్రపు శ్రీకాంత్, అజిత్, తదితరులు పాల్గొన్నారు.