21 August, 2026 | 12:26 AM

రెడీ ఫర్ రైడ్

08-12-2024 01:55 AM
  1. * అందుబాటులోకి ఆరాంఘర్ ఫ్లుఓవర్

* నేడు సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభం

* నగరంలోనే అతిపెద్దదిగా రికార్డు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (విజయక్రాంతి): ఎస్సార్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో మరో అతిపెద్ద ఫ్లుఓవర్ (ఆరాంఘర్  జూపార్కు)ను ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 2021 ఏడాదిలో ప్రారంభమైన ఈ ఫ్లుఓవర్ పనులు 24 మీటర్ల వెడల్పుతో 6 లేన్లలో 4.08 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు.  కాగా ఉమ్మడి రాష్ర్టంలో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేను 2009 లో 11.66 కిలోమీటర్ల పొడవుతో 4 లేన్లతో నిర్మించారు. ఈ ఫ్లుఓవర్ దేశంలోనే నెంబర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత అతిపెద్ద ఫ్లుఓవర్‌గా కొత్తగూడ ఫ్లుఓవర్ 3 కిలోమీటర్ల పొడవుతో 4 లేన్లతో నిర్మించారు. అయితే ఆరాంఘర్ ఫ్లుఓవర్ 4.08 కిలోమీటర్ల పొడవుతో 6 లేన్లలో అందుబాటులో వస్తుండగా ప్రస్తుతం ఈ ఫ్లుఓవర్ నగరంలో అతిపెద్ద రెండో ఫ్లుఓవర్ స్థానాన్ని దక్కించుకోనుంది.