27-10-2025 12:02:35 AM
టెండర్ దారులు ఉదయం 9 గంటలకే చేరుకోవాలి
జిల్లా ఎక్సైజ్ అధికారి సుధాకర్
మహబూబ్ నగర్, అక్టోబర్ 26(విజయక్రాంతి): జిల్లాలో ఏ4 దుకాణాల కోసం లాట్లడ్రా సోమ వారం ఉదయం 11 గంట లకు ప్రారంభించడం జరుగుతుందని జిల్లా ఎక్సైజ్ అధికారి సుధాకర్ తెలియజేశారు. అసౌకర్యాన్ని నివారించడానికి దరఖాస్తుదారులు ఉదయం 9గంటల లోపు వేదిక వద్దకు చేరుకోవాలని సూచించారు. దరఖాస్తు అసలు రసీదుతో పాటు ప్రవేశ పాస్ చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువును తీసుకురావాలని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లను హాల్లోకి అనుమతి ఉండదని, లాట్ల డ్రా ద్వారా ఎంపిక చేయబడిన విజయవంతమైన దరఖాస్తుదారులు సోమవారం, మరుసటి రోజు షాప్ ఎక్సైజ్ పన్ను యొక్క మొదటి వాయిదాను చెల్లించాలని తెలిపారు. డీపీఈవో నుంచి షాప్ కేటాయింపు నిర్ధారణ లేఖను తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటించి, డ్రా ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు. మహబూబ్ నగర్ నూతన సమీకృత సముదాయ భవనం (ఐడీవోసీ)లోని సమావేశ మందిరంలో డ్రా ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని సమయానికి చేరుకోవాలని సూచించారు.