14 August, 2026 | 1:31 AM

నిరుపేదల సొంతింటి కల సాకారం

14-08-2026 12:00 AM

ఎమ్మెల్యే మేఘారెడ్డి

పెద్దమందడి, ఆగస్టు 13: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం పెద్దమందడి మండలం అమ్మపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేసుకున్న ఐదుగురు లబ్ధిదారుల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే పాల్గొని నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర్రెడ్డితో కలిసి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.