20 April, 2026 | 1:44 AM

వెయ్యి గొంతులతో హనుమాన్ చాలీసా పారాయణం

20-04-2026 12:03 AM

101 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం

కోడూరి ఆంజనేయస్వామి ఆలయం ఎదుట సామూహిక పఠనం

కామారెడ్డి, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 1000సంవత్సరాల పురాతన కోడూరి ఆంజనేయస్వామి క్షేత్రంలో వేదపండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మగారి ఆధ్వర్యంలో ఆదివారం వేయి మంది భక్తుల ఏకస్వర నాదంతో, 101సార్లు  హనుమాన్-చాలీసాపారాయణ చేపట్టారు.

హనుమాన్ చాలీసా ధ్వనిలో&భక్తి తరంగాలు ఆకాశాన్ని తాకిన పవిత్ర వేళ పరవశించిన,కొడూరు ఆంజనేయుడు ఆనందంతో, భక్తుల 101సార్ల హనుమాన్ చాలీసా పారాయణ ప్రార్థనలను పుష్పాలుగా మార్చి, పరమపదంలౌని ముక్కోటిదేవతల ప్రతినిధిగా, వాయుదేవుడు తన కృపామృతాన్ని జోడించి, వరుణదేవుడు స్నేహ స్ఫూర్తిని జలధారగా కురిపించగా కుంభవర్షమై దైవానుగ్రహాన్ని చూపాడని, ఇది సాధారణ వర్షం కాదు, భక్తి శక్తికి దైవ సమాధాన మనీ శ్రీ గంగవరం ఆంజనేయ శర్మ భక్తులను ఉద్దేశించి అన్నారు.

ఇది ప్రకృతి పలికిన మంగళ గీతం అన్నారు. మా పూజలకు పరమాత్మ ఇచ్చిన ప్రసాదం అని వేయి గుండెలు ఒక్కటై జపించిన నామస్మరణ, దైవ లోకాన్ని కదిలించిన మహా శక్తి అన్నారు. ఆ శక్తికి సాక్ష్యంగా ఈ కుంభ వర్షం,శుభ సూచనగా మన ఊరును పరవశింపజేసినదని కొడూరు హనుమంతుని కటాక్షంతో, ప్రతి ఇంటా ఆనందం వెల్లి విరియాలని, ప్రతి హృదయం భక్తితో నిండాలి&అనీ ప్రతి జీవితం విజయాలతో వెలుగొందాలనీ వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ, ఆకాంక్షిస్తూ ఆశీర్వదించినారు. 

ఇది ఒక ప్రపంచ చరిత్ర గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కబోతుందిఅన్నారు, ఉదయం 8 గంటలకు మొదలైన హనుమాన్ చాలీసా దాదాపు 6గంటలు ఒక్కరు కూడా కూర్చున్న చోట కదలకుండా ఏకాసనం మీదఉండి హనుమాన్ చాలీసా వెయ్యి మంది 101 సార్లు  పారాయణం చేయడం ఇది చాలా గొప్ప విషయమని అన్నారు, ఇప్పటినుండి ప్రతి శనివారం, మంగళవారం, పూర్ణిమ రోజు,  శ్రీకోడూరి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్న భక్తులందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఆశీస్సులు తెలుపుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఈప్ప ఉమారాణి, శ్రీనివాస్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు.