18 August, 2026 | 8:15 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

సినిమా ఇండస్ట్రీకి సంపూర్ణ మద్దతు

20-04-2026 12:02 AM

నాగోల్, ఏప్రిల్ 19 (విజయ క్రాంతి) హైదరాబాద్ ఫిలింనగర్లోని రామానాయుడు స్టూడియోలో పార్వతి సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న రెటీనా (ఐస్ నెవర్ లై) సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రధా న కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్య క్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త, ప్రముఖ నిర్మాత-దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు యాట సత్యనారాయణ హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సం దర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ, తెలంగాణలో సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సినీ రంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో యశ్వంత్, నిర్మాత పార్వతి, దర్శకుడు అల్లం రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవికుమార్, హీరో మనీష్, హీరోయిన్లు సోనియా నాయుడు, ప్రీతి హెప్సోనా, సీనియర్ నటులు లక్ష్మి పార్వతి, పుష్పా చౌదరి, యోగి ఖత్రి తదితరులు పాల్గొన్నారు.