07-08-2025 05:53:07 PM
నల్ల బ్యాడ్జీలతో నిరసన..
అన్యాయాలపై రాజీలేని పోరాటం..
ఐఎన్టీయూసీ కేంద్రకమిటీ ఉపాధ్యక్షుడు కాంపల్లి సమ్మయ్య..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఎన్నికై ఏడది కాలంలో ఏఐటీయూసీ కార్మికుల హక్కుల సాధనలో పూర్తిగా విఫలమైందని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (INTUC) కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపల్లి సమ్మయ్య(Senior Vice President Kampelli Sammaiah) అన్నారు. ఏడాది కాలం గుర్తింపు సంఘం వైఫల్యానికి నిరసనగా సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టీయూసీ సింగరేణి వ్యాప్తంగా తలపెట్టిన బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం శాంతిఖనిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఏ చిన్న సమస్యను కూడా పరిష్కరించలేదని విమర్శించారు. కార్మికుల హక్కుల సాధన నుంచి వై తొలగిందని నేపథ్యంలో ప్రాతినిధ్య సంఘంగా ఐ ఎన్ టి యూసీ కార్మికుల పక్షాన నిలిచిందన్నారు. ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ అక్రమ సంబంధంతో సింగరేణిలో గుర్తింపు పగ్గాలను ఏ ఐ టీయూ సీ కైవసం చేసుకున్నదన్నారు.
కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్న ఏఐటీయూ సి పాపంలో టీబీజీకే ఎస్ భాగం ఉందన్నారు. నల్లజర్ల బ్యాడ్జీల నిరసన కార్యక్రమం తర్వాత ఈనెల 14న సింగరేణి వ్యాప్తంగా జిఎం ఆఫీస్ ఎదుట ధర్నా చేపడతామన్నారు. అప్పటికి యజమాని స్పందించకపోతే 21న కార్పొరేట్ ఆఫీసును ముట్టడిస్తామని పేర్కొన్నారు. అప్పటికి యజమాన్యం దిగిరాకపోతే యజమాన్యం అనుసరిస్తున్న విధానాల పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రావు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మంత్రులపై కూడా ఒత్తిడి పెంచుతామన్నారు. కార్మికుల సమస్యల పరిష్కార సాధనకై ఐఎన్టియుసి గతం నుంచీ పోరాటం చేస్తున్నదనీ పేర్కొన్నారు. సింగరేణిలో మెడికల్ అటెండెన్స్ రూల్స్ ను మార్చాలనీ, జులై 31న జరిగిన మెడికల్ బోర్డులో కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఐఎన్టియుసి భావిస్తున్నదన్నారు.
ఈ బోర్డును రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. అండర్ గ్రౌండ్లో అన్ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, ట్రేడ్మెన్ ఈపీ ఆపరేటర్లకు సర్ఫేస్ సూటబుల్ జాబ్ ఇవ్వాలన్నారు. సొంతింటి కలను నిజం చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుడి సంవత్సర జీవితంలో మూడు నెలలు ఇన్కం టాక్స్ కట్టడానికే సరిపోతున్నదని పేర్కొన్నారు. అధికారుల మాదిరిగా పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ మాఫీ చేయాలన్నారు. సింగరేణిలో అనేక భూగర్భగనులు మూతపడే అవకాశం ఉన్నందున తక్షణం నూతన గనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సేఫ్టీ ట్రైపాడ్ సమావేశాలు గత 18 నెలల నుండి జరగకపోవడం వలన రక్షణ విషయంలో వెనుక బడ్డామన్నారు.. ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రమాదలే దీనికి నిదర్శనమని ఈ ప్రమాదాల నివారణకై వెంటనే సేఫ్టి ట్రైపాడ్ మీటింగ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఏరియాలో చాలా క్వాటర్లు శిథిలావస్థకు చేరినందున వెంటనే నూతన క్వాటర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు నూతన బదిలీ విధానం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నందున ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెరుగైన క్యాడర్ స్కీమ్ విధానాన్ని ప్రవేశపెట్టి నూతన ప్రమోషన్ పాలసీని తీసుకురావాలన్నారు. అండర్ గ్రౌండ్లో అన్ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, ట్రేడ్మెన్ ఈపి ఆపరేటర్లకు సర్ఫేస్ సూటబుల్ జాబ్ ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్లపై అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు శంకర్రావు, కుక్కల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.