07-08-2025 07:55:59 PM
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ తంగళ్ళపల్లి మండల కార్యాలయంలో విభజన గాయాల స్మృతి దినం, హర్ ఘర్ తిరంగా యాత్రపై మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో మండల కార్యశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తంగళ్ళపల్లి మండల ఇంచార్జి ఆడేపు రవీందర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని మండల, గ్రామాలలో విజయవంతం చేయాలని, కార్యక్రమాన్ని ఉద్దేశించి మార్గనిర్దేశించడం జరిగింది.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం 7 & 8వ తేదీలలో మండల స్థాయి కార్యశాల మండల అధ్యక్షులు, మండల కార్యవర్గం, శక్తికేంద్రం ఇంచార్జి బూత్ ఇంచార్జి 9, 10, 11వ తేదీ జిల్లా తిరంగ ర్యాలీ, మండల స్తాయి తిరంగ ర్యాలీ 12,13వ తేదీ అమరవీరుల స్థూపాలు శుభ్రపరుచుట, స్వచ్ఛభారత్ భారత జాతీయ అమరవీరులు 14వ తేదీ స్వతంత్రంకి ముందు పాకిస్థాన్ గాయాల విభజన, నిరసన కార్యక్రమం విభజనకి నిరసన. 13 & 14 & 15వ తేదీ జాతీయ జెండా ఇంటిమీద ఎగురవేయాలి, ఎగరేసిన జెండా సాయంత్రం తీసివేయాలి.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు ఇటికల రాజు కోస్ని వినయ్ యాదవ్ ఉపాధ్యక్షులు రెడ్డిమల్ల ఆశీర్వాద్ ఇటుకల మహేందర్,తుపాకుల సత్తయ్య,అమరగొండ రాజు,కాళీ చరణ్, నందగిరి నవీన్ సిలివేరి ప్రశాంత్ అసాని లక్ష్మారెడ్డి,గోనేపెల్లి శ్రీనివాస్, మీరాల ఎల్లయ్య, ముత్యం యాదవ్,చిట్టి శ్రీపాల్గొన్న నక్క అశోక్, కట్ట తిరుపతి, రేగుల రాజు, మైలారం మహేష్, కందుకూరు మహేష్, గొర్రె మహేష్ నాగుల శ్రీనివాస్.దాసరి రాజు బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.