calender_icon.png 7 August, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

120 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

07-08-2025 07:46:33 PM

ఆదర్శంగా నిలుస్తున్న పట్లోళ్ల కిషోర్ కుమార్..

పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు కృతజ్ఞతలు..

నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మనకోసం మనం స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు పట్లోళ్ల కిషోర్ కుమార్  అచ్చంపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన 120 మంది విద్యార్థులకు 70 వేల విలువగల క్రీడా దుస్తులను గురువారం ఉచితంగా అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాల్ సింగ్ విజ్ఞప్తి మేరకు ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విద్యార్థులకు క్రీడా దుస్తులను అందించారు.

కార్యక్రమంలో అచ్చంపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జోసఫ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాల్ సింగ్,నిజాంసాగర్ , మహమ్మద్ నగర్ మండలాల పీఆర్టియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంతోష్ కుమార్, సురేందర్, నారాయణ, వెంకటరామిరెడ్డి, భాస్కర్ గౌడ్, జనార్ధన్, అజయ్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు . విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేసిన పట్లోళ్ల కిషోర్ కుమార్ కు పిఆర్టియు మండల శాఖ, అచ్చంపేట గ్రామస్తులు  కృతజ్ఞతలు తెలిపారు.