calender_icon.png 7 August, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేర్యాల రెవిన్యూ డివిజన్ కోసం బైక్ ర్యాలీ

07-08-2025 05:55:40 PM

చేర్యాల: పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం గురువారం దూల్మిట్ట మండలంలో నిర్వహించిన బైక్ ర్యాలీ విజయవంతమైందని పొలిటికల్ జేఏసీ చైర్మన్ వకుళాపురం నరసయ్య(Political JAC Chairman Vakulapuram Narasaiah) పంతులు అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, మండలంలోని వీరబైరాన్ పల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అక్కడి నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించారు. అన్ని గ్రామలలో బైక్ లతో ర్యాలీ నిర్వహించారు. దూల్మిట్ట తహసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాలు, ప్రజాసంఘాలు, చేర్యాల రెవిన్యూ డివిజన్ ఆకాంక్ష పరులు పాల్గొన్నారు.