07-08-2025 08:11:57 PM
బెజ్జూర్ (విజయక్రాంతి): బైక్ అదుపుతప్పి కింద పడడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం... బెజ్జూరు మండలం(Bejjur Mandal) లంబడి గూడ గ్రామానికి చెందిన కుమ్మరి లింగయ్య బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చింతల మానేపల్లి మండలం రుద్రాపూర్ నుండి బెజ్జూర్ కు వస్తుండగా రుద్రాపూర్-ముంజంపల్లి మార్గమధ్యంలో బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. క్షతగాత్రుడు లింగయ్య తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108లో బెజ్జూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ అంబులెన్స్ లో కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు.