calender_icon.png 7 August, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత తప్పనిసరి

07-08-2025 08:03:36 PM

కోదాడ: అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఆయిల్ సూర్యాపేట, ఖమ్మం జిల్లాల సేల్స్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్(Officer Praveen Kumar) అన్నారు. మండల పరిధిలోని గుడిబండ శివారులోని అంజన్ ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గురువారం అగ్నిప్రమాద నియంత్రణకు డెమో ఏర్పాటు చేశారు. ఇండియన్ ఆయిల్ టయప్ కంపెనీ బ్రాండ్స్ డాడీ రూపొందించిన ఆటో ఫెయిర్ ఎస్టింగ్ మిషన్ ప్రతి గృహంలో అమర్చుకోవాలని సూచించారు. విద్యుత్, గ్యాస్, ఇతర అగ్ని ప్రమాదాలను ఈ యంత్రం నియంత్రిస్తుందని పేర్కొన్నారు. యంత్రం యొక్క ప్రయోజనాలను గ్రామస్తులకు వివరించారు. అనంతరం డెమోలో పాల్గొని విజయవంతంగా ప్రయోగం చేశారు. నల్గొండ సేల్స్ ఆఫీసర్ సంపత్ కుమార్, కంపెనీ ప్రతినిధులు శైలేష్, దీపీక, అంజన్ గౌడ్, రాజశేఖర్, శ్యామ్ తదితరాలు పాల్గొన్నారు.