07-08-2025 07:49:42 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): నగరంలోని 12వ డివిజన్ శివారు ప్రాంతమని ఈ డివిజన్ గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయ్యిందని ఇకనైనా ఒకసారి డివిజన్ సందర్శించాలని డివిజన్ సందర్శించి అభివృద్ధికి సహకరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ను వినతిపత్రం ద్వారా మాజీ కార్పొరేటర్ ఎ.వి.రమణ కోరారు. ఈ సందర్బంగా రమణ మాట్లాడుతూ... ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్యమంత్రి హామీ నిధులు 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినా ఎఓస్ కాలనీ, రాంచంద్రాపూర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ పనులు ఇంకా పూర్తి కాలేదని అట్టి పనులు పూర్తి అయ్యేలా చొరవ తీసుకోవాలని, బతుకమ్మ కాలనీ, హస్నాపూర్ కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని అట్టి సమస్య పరిష్కారించాలని కోరారు.