15 March, 2026 | 7:36 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్

30-10-2025 01:32 AM
  1. గురు, శుక్రవారాల్లోనూ వానలే 
  2. భారీ నుంచి అత్యంత భారీగా కురిసే అవకాశం

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని 8 జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదా ద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లా ల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 కి.మీ. వేగంతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

మొంథా తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో కూడా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే రాష్ట్రంలోని కుమ్రంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఈ జిల్లాకు ఆరెంజ్ అలెర్టను వాతావరణ శాఖ జారీ చేసింది. దీంతోపాటు నిజాబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 

బుధవారం నమోదైన వర్షపాతం

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 9 గంటల వరకు ఉన్న వివరాలను వాతావరణ కేంద్రం విడుదల చేసింది. అత్యధిక వర్షపాతాలు నమోదైన పది ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి.