calender_icon.png 2 November, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేయూ న్యాయ కళాశాల ప్రహరీ నేల మట్టం

30-10-2025 01:32:16 AM

కాకతీయ విశ్వవిద్యాలయం, అక్టోబర్ 29 (విజయక్రాంతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి  150-180 మి.మీ.ల భారీ వర్షాలు నమోదయ్యాయి. హన్మకొండలోని కేయూ, న్యాయ కళాశాల ప్రహరీ గోడ సర్క్యూట్ హౌజ్ దారి వైపు నేలమట్టమయింది, ఎలాంటి ప్రమాదం జరుగలేదు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల అరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. జిల్లాలో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పలు ప్రాంతాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్, హన్మకొండ జిల్లాలపై తుపాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. రాబోయే 24 గంటల్లో ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా ప్రజలు సురక్షితంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది.