calender_icon.png 24 September, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2.31 లక్షల డిగ్రీ సీట్లు ఖాళీ!

24-09-2025 01:29:49 AM

  1. ముగిసిన అడ్మిషన్ల ప్రక్రియ
  2.   967 కాలేజీల్లో 4.38 లక్షల సీట్లకు 2.06 లక్షలు మాత్రమే భర్తీ
  3. ఏటా డిమాండ్‌కు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేస్తున్నా నిండని సీట్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): స్పెషల్ స్పాట్ అడ్మిషన్లతో డిగ్రీ అడ్మిషన్లు ప్రక్రియ ఈ నెల 20తో ముగిసింది. డిగ్రీలో ప్రవేశాలు ముగిసినా సీట్లు మాత్రం పూర్తిస్థాయిలో నిండలేదు. ఎన్నడూలేనంతగా ఈ సారి సీట్లు మిగిలిపోయా యి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, నాన్ దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) కాలేజీలు 967 ఉన్నాయి. వీటిలో 4,38, 387 సీట్లు ఉంటే, ఇందులో స్పాట్ అడ్మిషన్లు మినహా 1,96,451 సీట్లు భర్తీ అయ్యా యి.

ఇంకా 2,41,936 సీట్లు నిండలేదు. స్పా ట్ అడ్మిషన్లలో భర్తీ అయిన సీట్లు దాదా పు 5 వేల వరకు ఉంటాయి. అంటే ఇప్పటివరకు నిండిన మొత్తం సీట్లు 2,06,451 కాగా, ఇంకా మిగిలిన సీట్లు 2,31,936 ఉన్నాయి. ఇంత మొత్తంలో సీట్లు గతేడాది కూడా మిగల్లేదు. కానీ, సీట్ల పరంగా చూసుకుటే ఈ సారి అత్యధికంగా ఖాళీగా మిగలడం గమనార్హం. 2024-25 విద్యాసంవత్సరంలో మొత్తం 4,57,704 సీట్లకు 2.12 లక్షలు సీట్లు భర్తీకాగా, 2.45 లక్షల సీట్లు ఖాళీగా మిగిలాయి.

గురుకులాల్లోనూ మిగిలిన సీట్లు..

టాప్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే కాదు.. గురుకులాల్లోనూ ఈ సారి సీట్లు మిగిలాయి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలు 79 ఉండగా, ఇందులో 23,614 సీట్లకు 11,257 సీట్లే భర్తీ అయ్యాయి. ఈ నెల 11 వరకు ఉన్న అధికారిక గణాంకాల ప్రకారం గురుకులాల్లో 12,357 సీట్లు మిగిలాయి. సోషల్ వె ల్ఫేర్ డిగ్రీ కాలేజీల్లో 8,080 సీట్లకు 2,897 సీట్లు మిగలగా, ట్రైబల్ వెల్ఫేర్‌లో 5,620 సీట్లలో ఇంకా 2,291 సీట్లు నిండలేదు.

బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీల్లో 9,914 సీట్లకు 7,169 సీట్లు మిగిలాయి. ఇక దోస్త్ పరిధిలోలేని కాలేజీలు 58 ఉన్నాయి. వీటిలో 36,866 సీట్లకు 16,182 మాత్రమే నిండగా, 20,684 సీట్లు మిగిలాయి. ఇలా మొత్తంగా స్పాట్ అడ్మిషన్లలో సుమారు ఓ 5 వేల సీట్లు నిండాయనుకున్నా, మొత్తం 967 కాలేజీల్లో 4,38,387 సీట్లకు 2,06,451 సీట్లు నిండగా ఇంకా సీట్లు 2,31,936 భర్తీ కాలేదు.

మొదటి నుంచీ ఇంతే

మొదటి నుంచీ డిగ్రీ కోర్సు ల్లో సీట్లు అత్యధికంగా మిగులుతున్నాయి. బీఎస్సీ, బీఏ, బీకామ్‌లలో ఒక్క బీకామ్ మినహాయిస్తే మిగతా కోర్సుల్లో విద్యార్థు లు చేరేందుకు ఇష్టపడటంలేదు. డిగ్రీ చేసినవారికి ఉపా ధి అవకాశాలు తక్కువగా ఉండ టం, ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, ఇతరత్రా డిమాం డ్ ఉన్న కోర్సులవైపు విద్యార్థు లు మక్కువ చూపిస్తుండటం దీనికి ప్రధాన కారణం.

ఈ క్రమంలోనే ఏటా డిగ్రీలో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా డిగ్రీ సిలబస్‌ను ఎప్పటి కప్పుడు తెలంగాణ ఉన్నత విద్యామండలి మార్పులు చేర్పులు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయి లో సీట్లు నిండటంలేదు. ఇప్పటికే నాలుగైదు దఫాల్లో డిగ్రీ సీట్లు నింపినా రెండు లక్షల సీట్లే భర్తీ అయ్యాయి.