14-07-2025 11:08:26 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy District) ఎల్లారెడ్డి మండలం సబ్జాల్పూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బయ్యని నవీన్(28) అనే యువకుడు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. ఆర్థిక పరిస్థితులు బాగోలేక కుటుంబానికి భారం కాకూడదని ఉద్దేశంతో జగిత్యాల జిల్లా కోరుట్లలో మిషన్ భగీరథలో పనిచేస్తున్నాడు. ప్రతిరోజు లాగే పనిలో ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.