23 July, 2026 | 11:33 AM

అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు

01-06-2024 01:17 AM

వరంగల్, మే 31 (విజయక్రాంతి): నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పోలీస్ నిఘా ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు అమ్మేవారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం విత్తనాల లభ్యత, వానకాలం సాగుపై నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో విత్తన కొరత లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆమె రోజువారీ పర్యటనలో భాగంగా వరంగల్ స్టేషన్ రోడ్డులోని విత్తన దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

డీలర్లతో సమావేశం..

వరంగల్, మే ౩1: విత్తన కంపెనీలకు చెందిన డీలర్లతో కలెక్టర్ ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనుమతి లేకుండా ఎవరైనా విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీలు అబ్దుల్ బారి, రవీందర్, ఏసీపీలు తిరుపతి, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.