23 July, 2026 | 10:42 AM

నకిలీ విత్తనాలను అరికట్టాలని ధర్నా

01-06-2024 01:19 AM

వరంగల్, మే 31 (విజయక్రాంతి): జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టాలని, నిబంధనలను అతిక్రమించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు నగరంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. వరంగల్ నగరంతోపాటు నర్సంపేట, వర్ధన్నపేట ప్రాంతాల్లో యథేచ్ఛగా నకిలీ విత్తనాలు, పురుగు మందుల దందా నడుస్తుందన్నారు. కొందరు వ్యాపారులు ఎమ్మార్పీ ధర కంటే రైతుల నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారన్నారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో నాయకులు బాలరాజు, రాజేందర్, దయాకర్, కోటేశ్వర్‌రావు, తిరుపతి, కృష్ణ, పూలక్క, హరిబాబు, వీరన్న, భద్రాజీ పాల్గొన్నారు.