17-10-2025 12:00:00 AM
వెంకటాపురం (నూగూరు), అక్టోబర్ 16 (విజయక్రాంతి) : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని కాఫేడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మారుమూల గ్రామ ప్రాంతంలో వరద బాధితులకు కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ బుధవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 350 కుటుంబాలకు ఈ వస్తువులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకటాపురం మండల తాసిల్దార్ వేణుగోపాల్, వెంకటాపురం మండల పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్ . హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటాపురం తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ చేసే సేవలను పేద బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు.
కాఫేడ్ స్వచ్ఛంద సంస్థను ఇక ఎన్నో సేవలు అందించాలని కోరారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్ మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతంలో ప్రజలకు అనేక విధాలుగా సహాకారాలు అందిస్తున్న కాఫేడ్ సంస్థకు అభినందించారు. సొసైటీ చైర్మన్ చిడెం మోహన్ రావు మాట్లాడుతూ కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ 2002సంవత్సరంలో ప్రారంభించిన నాటి నుండి ఏజెన్సీ ఏరియాలో ఉపయోగపడే వివిధ పథకాలు, అభివృద్ధి పనులను చేయడం జరుగిందని కొనియాడినారు.
అలాగే వెంకటాపురం బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంప రాంబాబు మాట్లాడుతూ కాఫేడ్ సంస్థ మొట్టమొదటిసారిగా గ్రామంలోని పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి, మహిళలకు వాళ్ల సంతకాలు పెట్టే విధంగా నేర్పించడం జరిగిందన్నారు. కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లూర్థు రాజుని అభినందించినారు.
వెంకటాపురం మండల కోఆర్డినేటర్ గొంది కామేష్, గొంది హనుమంతు,వెంకటాపురం, వాజేడు మండల యానిమేటర్స్ ప్రశాంత్, నరేష్, ప్రసాద్, ఇందిరా, సుజల, పద్మ, భాస్కర్, స్వరూప, రమాదేవి, కిషోర్, వెంకటాపురం మండల టిఆర్‌ఎస్ నాయకుడు గుడపర్తి నరసింహా మూర్తి, కాంగ్రెస్ నాయకుడు మురళి, ఫాధర్ ఇనరెడ్డి పాల్గొన్నారు.