calender_icon.png 20 October, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 కిలోల గంజాయి దహనం

17-10-2025 12:00:00 AM

ఏఎస్పీ సురేందర్ రావు వెల్లడి

ఆదిలాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): గంజాయి డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున గంజాయి దహనం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో నమోదైన 18 కేసుల్లో పట్టుబడ్డ 41 కిలోల 918 గ్రాముల గంజాయినీ దహనం చేసినట్లు అదనపు ఎస్పీ సురేందర్ రావు వెల్లడించారు. ఇం దులో 21.057 కిలోల గంజాయి మొక్కలు, 20.861 కిలోల ఎండు గంజాయి ఉందన్నా రు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి వద్ద గల శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంటర్‌లో ఈ గంజాయి దహనం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డిసిఆర్బి ఎస్‌ఐ హకీమ్, సిబ్బంది పాల్గొన్నారు.