25-09-2025 12:00:00 AM
మతం ఏదైనా సారం ఒక్కటే. దీని ప్రకారం అన్ని మతాలు మానవత్వానికి, మంచితనానికి, ప్రేమకు ప్రాధాన్యత ఇస్తాయి. మతాలు భిన్నంగా కనిపించినా, వాటి ముఖ్య ఉద్దేశం ప్రజలను మంచి మార్గంలో నడిపించడం, నీ తివంతమైన జీవితాన్ని గడిపేలా ప్రోత్సహించడమే. అయితే మత మార్పిడి ము సుగులో మానవ అక్రమ రవాణా కార్యకలాపాలకు ఆస్కారం ఉందని రాష్ట్రీయ స్వయం స్వేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్) మలయాళ అనుబంధ ప్రచురణ సంస్థ ‘కేసరి’ వార పత్రిక ఒక కథనం రాయడం చర్చనీయాంశమైంది.
కేరళకు చెందిన కొందరు మత పెద్దలు, కాథోలిక్ నన్‌లు కలిసి మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఉల్లఘించి బలవంతపు మత మార్పిడిలకు పాల్పడుతు న్నారని కేసరి తన ప్రచురణలో పేర్కొంది. గత జూలైలో ఛత్తీస్‌గఢ్‌లో కేరళకు చెం దిన ఇద్దరు క్యాథలిక్ నన్‌లు బలవంతంగా మత మార్పిడి, మానవ అక్రమ రావాణా చేస్తున్నారన్న ఆరోపణలతో అరెస్ట్ కావడం తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ ర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధ సంస్థ అయిన హిందూ ఐక్య వేదిక రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఇ.ఎస్. బిజు ‘క్రోనాలజీ ఆఫ్ గ్లోబల్ కన్వర్షన్’ పేరిట కేరళకు చెందిన కేసరి పత్రి కలో సుదీర్ఘ వ్యాసం రాసుకొచ్చారు. భారతదేశంలోని 11 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మతమార్పిడి నిరోధక చట్టాన్ని నిలిపివేయాలని కేరళకు చెందిన చర్చి మత పె ద్దలు పిలుపునిచ్చారని తెలిపారు. ఈ పి లుపు వివిధ మత వర్గాల మధ్య శత్రుత్వా న్ని సృష్టించడానికి ప్రయత్నించేలాగా ఉం దని అభిప్రాయపడ్డారు.
ఒక వ్యక్తి మిషనరీల ప్రభావానికి లోనయ్యి మత మార్పిడి కి అంగీకారం తెలిపితే గతంలో ఆ వ్యక్తి కొ నసాగిన మతంపై పూర్తి శత్రుత్వం పెంచుకునేలా క్రైస్తవ మత పెద్దల బోధనలు ఉం టున్నాయన్నారు. గతంలో సిరో-మలబార్ చర్చి, కేరళ కాథలిక్ చర్చి బిషప్ కౌన్సిల్ 19 95 వక్ఫ్ చట్టాన్ని సవరించాలని కోరుతూ వక్ఫ్ (సవరణ) బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ఒక లేఖను కూ డా పంపాయని తెలిపారు.
మత మార్పిడి అంశం ఆందోళన కలిగించే విషయమని.. మెజారిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరమని పేర్కొన్నారు. హిందూ స మాజం ఉద్దరణ, ఐక్యత కోసం కృషి చేసేవారు మత మార్పిడి శక్తులను ఓడించా ల్సిన అవసరముందని, వారు ఏ వ్యూహం అనుసరించినా దాన్ని తిప్పికొట్టేలా హిం దువులంతా ఐక్యంగా ఉంటూ మత మా ర్పిడి నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉం దని బిజు పేర్కొన్నారు.
సమాజానికి పెను ప్రమాదం
బలవంతపు మత మార్పిడిల వల్ల భారతీయ సమాజానికి పెను ప్రమాదం ముం చుకొస్తుందనేది ఆర్‌ఎస్‌ఎస్ నేతల వా దన. ఈ వాదనకు బలం చేకూరుస్తూ దే శంలోని వివిధ రాష్ట్రాల్లో బలవంతపు మ త మార్పిడిలు జరుగుతూనే ఉన్నాయి. గ త కొన్నేళ్లలో రాజస్థాన్, హర్యానా, గుజరా త్ సహా చాలా రాష్ట్రాల్లో బలవంతపు మత మార్పిడిలు ఎక్కువగా జరిగాయని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.
కాగా ఈ మత మార్పిళ్ల వివాదాలు దేశంలో కొత్తేమీ కాదు. బ్రిటీష్ ఇండియా కాలం నాటి నుం చే ఇదొక పెద్ద వివాదంగా మారుతూ వ చ్చింది. హిందువులను పెద్ద ఎత్తున క్రైస్తవులుగా మార్చి బ్రిటిష్ ప్రభుత్వానికి మిషనరీలు సహకరించాయనేది ఇప్పటికీ వి నిపించే ప్రధాన ఆరోపణ. తద్వారా భారత స్వాతంత్య్ర పోరాటాన్ని విచ్ఛిన్నం చేసేందు కు మిషనరీలు ప్రయత్నించాయని అనే వాళ్లు కూడా ఉన్నారు.
దేశానికి స్వా తంత్య్రం వచ్చాక రాజ్యాంగ రచన కోసం ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ కూడా దీనిపై లోతుగా చర్చించింది. బలవంతపు మార్పిళ్లను చట్టపరంగా గుర్తించకూడదంటూ 19 47 మే 1న సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ తీ ర్మానం కూడా ప్రవేశపెట్టారు. కానీ టీటీ కృ ష్ణమాచారి వంటి వాళ్లు మాత్రం మత మా ర్పిళ్లకు మూలాలేంటో చూడాలని వాదించారు. అంటరానితనం వంటి సామాజిక దురాచారాల వల్ల హిందువులు క్రైస్తవ మ తంలోకి మారుతున్నారని ఆయన చెప్పకొచ్చారు. ఈ వివాదం ఇంతటితో ము గి యలేదు.
ఆయా సందర్భాల్లో మత మా ర్పిళ్ల నియంత్రణ కోసం పార్లమెంటు లో బిల్లులు ప్రవేశపెడుతూ వస్తూనే ఉన్నారు. 1954లో ఇండియన్ కన్వర్షన్ రెగ్యులేషన్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లును, 1960లో బ్యాక్ వార్డ్ కమ్యూనిటీస్ రిలీజియన్ ప్రొటెక్షన్ బిల్లును, 1979లో ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్‌ను తీసుకొచ్చారు. కానీ వీటిలో ఏ బి ల్లు కూడా చట్టరూపం దాల్చలేదు. ఇటీవ లి కాలంలో ‘లవ్ జిహా ద్’ పేరుతో మత మార్పిడిలకు పాల్పడుతున్న సంఘటనలు ఎక్కువైపోయాయి. దీనిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ ఆర్‌ఎస్‌ఎ స్ సహా ఇతర హిందూ సంస్థలు విస్తృతం గా ప్రచారం చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనూ..
తెలుగు రాష్ట్రాల్లోనూ క్రిస్టియన్ మిషనరీల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. తమ ఇష్టంతో మతం మారితే తప్పు లేదని, కానీ ఇలా బలవంతంగా మ తం మా ర్పిడి చేయడం సరైన పద్ధతి కా దని చాలా మంది అభిప్రాయం. అంతేకా దు క్రిస్టియన్ మిషనరీలను ఊర్లోకి రానివ్వకుండా కొన్ని చోట్ల ఊరి శివారులో కం చెలు ఏర్పాటు చేసిన సందర్భాలు కోకొల్లలు. అంతేకాదు మత మార్పిడి పేరుతో సినిమాలు కూడా వచ్చాయి.
2023లో సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన యా దార్థ సంఘటనలతో రూపొందిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదానికి దారి తీసింది. 2018 దాదాపు 32 వేల మంది మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి వారిని ఐసిస్, ఇతర ఇస్లామిక్ ప్రాంతాలకు అక్రమంగా తరలించినట్టు వార్తలు వ చ్చాయి.
దీనిపై ఆర్‌ఎస్‌ఎస్ స హా ఇతర హిందూ సంస్థలు ఆగ్రహం వ్య క్తం చే శాయి. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక సభలో మాట్లాడుతూ.. ‘మత మార్పిడి వేర్పాటు వా దానికి దారి తీస్తుంది. మత మార్పిడి మూ లాల నుంచి వ్యక్తులను వేరు చేస్తుంది. మత మార్పిడిని ఆపడానికి కృషి చేయాల్సి న అవసరం ఉంది.’ అని పేర్కొన్నారు.
అసత్య ప్రచారాలు
కాగా ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ పత్రిక కే సరిలో ప్రచురితమైన కథనంపై కేరళకు చెందిన సిరో-మలబార్ చర్చి స్పందించిం ది. దేశంలోని క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని వర్గాల మధ్య విభజన, అపనమ్మకం, సామరస్యాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించింది. ఈ క్రమంలో ఉద్దే శపూర్వకంగానే కేసరి పత్రిక మత మార్పిడిపై అబద్ధపు ప్రచారాలు చేస్తుందని పే ర్కొంది.
‘కేసరి’ క్రైస్తవులను విమర్శిస్తూ ప్ర చురితమైన కథనం.. రాష్ట్రీయ స్వయం సే వక్ సంఫ్‌ు నిజమైన రంగును బయటపెట్టిందని కేరళలోని కాథలిక్ చర్చి ఆ రోపణలు చేసింది. ఇటీవల బీజేపీ పాలిత రాష్ట్రాలు మత మార్పిడిని నిషేధించే చట్టాలకు పదును పెట్టడం రాజ్యాంగ వి రుద్ధమని, దీనిని కోర్టులో సవాలు చేయాల్సిన అవసరముందని పేర్కొంది.
చట్టాల రూపకల్పన
మత మార్పిడులను నియంత్రించే స మాఖ్య చట్టం లేదు. అరుణాచల్ ప్రదేశ్ 1978లో మత స్వేచ్ఛా చట్టాన్ని రూపొందించింది, కానీ ఎప్పుడూ అమలు చేయ బడలేదు. రాజస్థాన్ మత మా ర్పిడి నిరోధక బిల్లులను ఆమోదించినప్పటికీ గ వర్నర్, రాష్ర్టపతి నుంచి ఆమోదం పొందలేదు. తమిళనాడు 2002లో మత మా ర్పిడి బిల్లును ఆమోదించినప్పటికీ ప్రజల నిరసనల బిల్లు అమలును వెనక్కి తీసుకుంది.
2023 నాటికి పదకొండు రా ష్ట్రాలు మత మార్పిడి నిరోధక చట్టంపై తమ సొంత చట్టాలను ఆమోదించుకున్నాయి. ఐక్యతకు ప్రతీకగా నిలిచే భా రత్‌లో ఇలాంటి మత వివాదాలకు ఆ స్కారం ఉండకూడదు. ఏ సమస్యనైనా సా మరస్యంగా, శాంతిపూరిత మార్గంలో పరిష్కరించుకోవాల్సిన అవసరముంది.