26-09-2025 12:00:00 AM
దసరా హిందువులకు ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు, పదవ రోజు విజయ దశమిగా నిర్వహించుకుంటారు. ఇది ముఖ్యంగా ఆదిశక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండుగ. ఈ పండుగను శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి, తర్వాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి, ఆ తర్వాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. ఆలయాల్లో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు.
ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ పండుగను ఆడుతారు. చరిత్ర ప్రకారం విజయదశమి రోజున రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాకుండా, పాండవులు వనవాసం వెళ్తూ జమ్మిచెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా ఇదే. ఈ సందర్భంగా జమ్మిచెట్టుకు పూ జా చేయడం ఆనవాయితీ. దసరా సందర్భంగా నగరంలో ఆలయ్ బలయ్ పేరుతో వేడక నిర్వహించడం ఆనవాయితీ. మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో వేడుక నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ వస్తున్న ది. ఈ వేడుక తెలంగాణకు ఒక కలికితురాయి వంటిది.
రామచంద్రరాజు, హైదరాబాద్