calender_icon.png 27 September, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూసీ నది

27-09-2025 09:04:34 AM

హైదరాబాద్‌: జంట జలాశయాలు(Reservoirs) నిండుకుండలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో వరద పోటెత్తింది. వరద ఉధృతి పెరగడంతో ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ గేట్లు తెరిచిన(Himayatsagar gates open) అధికారులు దిగువకు నీటి విడుదల చేశారు. భారీ వరదతో చాదర్ ఘాట్ లోయర్‌ బ్రిడ్జి మూసివేశారు. చాదర్ ఘాట్ మూసీ నది(Musi River) ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాగ్ వద్ద మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ వంతెన(Moosarambagh Bridge) పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ పాత వంతెనపై(Moosarambagh Old Bridge) 10 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన సామగ్రి వరద నీటిలో కొట్టుకుపోయింది. అటు అంబర్ పేట్ నుంచి దిల్ సుఖ్ నగర్(Amberpet to Dilsukhnagar) వెళ్లే ప్రధాన రహదారి మూసివేశారుభారీ వర్షానికి పురానాపూల్‌లోని శివాలయం నీట మునిగింది. శివాలయంలో ఉన్న పూజారి కుటుంబం సహాయం కోసం శివాలయం పైకెక్కి ఆర్తనాదాలు చేశారు. భారీ వరద ఉదృతికి పురానాపూల్‌ స్మశానవాటిక  నీట మునిగినట్లు సమాచారం.

అప్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ(Meteorological Department) ప్రకటించింది. శనివారం నాడు ఏ క్షణమైనా తీరం దాటే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. అప్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణలో పది జిల్లాలకు వాతావరణ శాఖ  రెడ్‌ అలర్ట్(Red alert) జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. శనివారం తెల్లవారుజామునుంచే జోరుగా వాన పడుతోంది. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయ పడుతున్నారు. అటు ప్రజలను అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. నీట మునిగిన కాలనీల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.