calender_icon.png 27 September, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరుగారుతున్న గవర్నర్ వ్యవస్థ

25-09-2025 12:00:00 AM

ప్రపంచంలోనే సుదీర్ఘ లిఖిత రా జ్యాంగం భారత్ సొంతం. శాసన, కా ర్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు రా జ్యాంగం విడివిడిగా అధికారాలను ఇ చ్చింది. ఆధునిక కాలంలో పరిపాలన అనే ది పోను పోను సంక్లిష్టంగా మారుతున్నం దు వల్ల ప్రభుత్వమే అన్ని పనులు చేయలేదు. అందుకే కొన్ని ముఖ్యమైన పాలన విధుల నిర్వహణకు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను రాజ్యాంగము కొలువు తీర్చింది. 

భారతదేశంలో గవర్నర్ల వ్యవస్థ 1967 వరకు సజావుగానే కొ నసాగింది. కేంద్రంలో, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ యా రాష్ట్రాల గవర్నర్లు ఎలాంటి వివాదాలకు గురికాలేదు. 1967లో జరిగిన ఎన్ని కల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెసేతర పక్షాలు కొత్తగా అధికారంలోకి వచ్చా యి. ఫలితంగా రాజకీయ సమతూకంలో తేడా వచ్చింది.

రాష్ట్రాలు తమ మాట వినకున్నా, దాసోహం అనకున్నా కర్ర పెత్తనం చేయడానికి కేంద్రం గవర్నర్లను ప్రయోగించడం ప్రారంభమైంది. సొంత పార్టీ వారిని గవర్నర్లుగా నియమించడం, కానివారిని తొలిగించడం లేదా తొలిగిపోయేటట్లు చే యడం రివాజుగా మారింది. గవర్నర్లు కూ డా తమ పూర్వాశ్రమానికి చెందిన పా ర్టీ అధికారంలోకి రావడానికి, ఇతర పార్టీలు అధికారంలోకి రాకుండా నిరోధించడానికి తమ వద్ద ఉన్న ‘విచక్షణా యు ద్ధాన్ని’ ప్రయోగించడం ప్రారంభించారు.

ఫలితంగా న్యాయస్థానాలు గవర్నర్ల నిర్ణయా లను నిరోధించిన ఉదంతాలూ చోటు చేసుకున్నాయి. రాజకీయాల్లో సంబంధంలేని వ్యక్తి గవర్నర్‌గా ఉండాలని, స్వే చ్ఛగా విధులు నిర్వర్తించడానికి కచ్చితమైన కాల వ్యవధి ఉండాలని, న్యాయ, పరిపాలన, సామాజిక రంగాలకు చెం దిన నిష్ణాతులు సూచించిన వివాదరహితుడైన వ్యక్తికీ  గవర్నర్ బాధ్య తలు అప్పగించాలని చట్టంలో ఉన్నా అవి అమల్లోకి రావడం లేదు. అంతేకాదు గవర్నర్ల వ్యవస్థ ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్న అభిప్రా యం సమాజంలో బలపడిపోయింది.

రాజకీయ జోక్యం

ప్రపంచంలోనే సుదీర్ఘ లిఖిత రా జ్యాంగం భారత్ సొంతం. శాసన, కా ర్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు రా జ్యాంగం విడివిడిగా అధికారాలను ఇ చ్చింది. ఆధునిక కాలంలో పరిపాలన అనేది పోను పోను సంక్లిష్టంగా మారుతున్నందు వల్ల ప్రభుత్వమే అన్ని పనులు చేయలేదు. అందుకే కొన్ని ముఖ్యమైన పాలన విధుల నిర్వహణకు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను రాజ్యాంగము కొలువు తీర్చింది.

ఇటీవలి కాలంలో రాజ్యాంగ చట్టబద్ధ సంస్థలు రాజకీయ జోక్యం మితిమీ రుతోందనే  విమర్శలు తలెత్తుతున్నాయి ఫలితంగా వాటి పనితీరుపై ప్రతికూల ప్ర భావం పడుతుంది. ప్రజాస్వామ్య పరిపుష్టికి, పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు రానురాను నీరు గారి పోతుండడంపై తీవ్ర ఆం దోళన వ్యక్తమవుతుంది.

జాప్యం చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా తమిళనాడు గవర్నర్ రవి 12 బిల్లులు ఆమో దించకుండా తొక్కి పెట్టారు. రాజకీయ ఒత్తిడితో బీజేపీయేతర ప్రభుత్వాలపై గవర్నర్ వీటో అధికారంపై అసాధారణ అధికారాలు ఉపయోగించి సర్వోన్నత ధర్మాస నం చారిత్రాత్మక తీర్పు కనువిప్పు కావాలి. 

పెండింగ్‌లోనే బీసీ బిల్లు

50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వ చట్టసవరణ చేసింది. ఈ బిల్లు గవర్నర్ వద్దే ఇంకా పెండింగ్‌లో ఉన్నది. ఈ చట్ట  సవరణకు ఆమోదం తెలిపితేనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అ మలు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ ఎదిరిచూస్తున్నది. గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ బిల్లు నిర్దేశిత గడువులోపు ఎదో ఒక నిర్ణయం తీసుకోక, రాష్ర్టపతికి పంపించామన్న సాకుతో పెండింగ్ లో పెడితే  ప్రత్యేకమైన జీవో జారీ చేసి ఎన్నికలకు పోవడం తథ్యం.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం బిల్లులను గవర్నర్ ఎప్పటిలోగా ఆమోదించాలన్న దానిపై ఎలాంటి కాలపరిమితి లేకపోవడం, గవర్నర్ స ర్వాధికారాలు దగ్గర పెట్టుకొని పరిపాలనకు అవరోధాలు సృష్టించి కేంద్రం చెప్పుచేతుల్లో మెదులుతుందనే అభిప్రాయం ఉంది. ఈ నెలాఖరులోపు స్థా నిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉండటంతో ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరుతుందనే ప్రచారం జరుగుతోంది.

ఇటీవల సు ప్రీం కోర్టు ధర్మాసనం నెలల తరబడి నా న్చకుండా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలనే తీర్పు తెలంగాణలో బీసీ రి జర్వేషన్లు అమలుకు సాధ్యం అవుతుందని కలలు కన్నారు. ఆ బిల్లులను గవర్నర్ స్వీకరించిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధి లోపు రాష్ర్టపతి నిర్ణయం తీసుకోవాలని ఆ దేశించింది. ఇటీవల కాలంలో తమిళనా డుతో పాటు కేరళ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ గవర్నర్ల తీరుపై తీవ్ర విమర్శలు రావడం కూడా ప్రధాన కారణం అయ్యింది.

రాజ్యాంగ స్ఫూర్తితో

ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను, మంత్రిమండలి తీర్మానాలను గవర్నర్ విచక్షణాధికారం పేరిట బిల్లులకు ఆమో దం తెలపకుండా మోకాలు అడ్డు పెడుతుండడంతో గవర్నర్ వ్యవస్థను నీరుగారు స్తుంది. తమిళనాడు ప్రభుత్వం ఏకంగా 2023లో బిల్లుల ఆమోదం కో సం కోర్టుమెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ డం చూ స్తే గవర్నర్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనేది స్పష్టమవుతుంది.

రేవంత్ ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి పేచీ పెట్టకుండా సవ్యంగా నడిచిన తరుణంలో 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలు లొల్లితో ప్రభుత్వానికి,రాజా భవన్ మధ్య అగాధం ఏర్పడింది. రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థ తన నిర్ణయాల్లో జాప్యం చేయడం వల్ల ప్ర జా పరిపాలన వ్యవస్థ స్ఫూర్తికి తూట్లు పొ డిచే విధంగా తొక్కిపెట్టడం వెనుక బీజే పీ హస్తం ఉందన్న అనుమానాలు వస్తున్నాయి.

బిల్లు జనాభాలో సగం మందికి మే లు చేస్తున్నదని భావించినప్పుడు బిల్లు పై నిర్ణయం తీసుకోకుండా ఉండడం సరికా దు. చాలా కాలంగా గవర్నర్ వద్ద 42 శా తం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ బిల్లు పెండింగ్‌లో పెట్టి రాష్ర్టపతి పరిశీలనకు బిల్లులను పం పడం వెనుక రాజకీయ క్రీనీడలో గవర్నర్ వ్యవస్థ చేరిందనే ప్రచారం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి వంత పాడుతూ రాష్ర్ట ప్రభుత్వాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్న గవ ర్నర్ వ్యవస్థకు ఆపాదు రాకుండా రాజ్యాం గ స్ఫూర్తితో పనిచేయడం మంచిది.