25-05-2025 12:00:00 AM
పల్లెటూరి వాతావరణంలో పెరిగిన ప్రతి ఒక్కరికి పులి మేక ఆట గురించి తెలిసే ఉంటుంది. మట్టి మైదానంలో, చెట్టు నీడలో, ఇంటి ముందు వరండాలో అప్పుడప్పుడు ఈ ఆటను ఎంతో ఇష్టంగా ఆడేవాళ్లం. పులిగా ఉన్నవాడు మేకలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే, మేకలుగా ఆడేవాడు పులి చేతికి దొరకకుండా తప్పించేవాడు. మేకలుగా చిన్నరాళ్లను, పులిగా అంతకన్నా కాస్త పెద్ద రాళ్లను పెట్టి పులి మేక ఆడేవాళ్లం.
ఈ ఆటలో గెలవడానికి మనకు తెలియకుండానే ఎన్నో వ్యూహాలు రచించేవాళ్లం. ఈ ఆట ఆడుతుంటే సమయం ఎలా గడిచిపోయేదో తెలిసేదే కాదు. ఎంతసేపు ఆడినా అలసిపోయేవాళ్లం కూడా కాదు. ఈ ఆధునిక యుగంలో పిల్లలు చాలా వరకు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లలో గేమ్స్ ఆడుతూ బంగారం లాంటి సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. చిన్నతనంలో ఇలాంటి ఆటలు ఆడితే.. సృజనాత్మకత పెరుగుతుంది.