calender_icon.png 25 May, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంజాబ్‌కు షాక్

25-05-2025 12:54:47 AM

6 వికెట్ల తేడాతో నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

న్యూఢిల్లీ, మే 24: ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన పంజాబ్ కింగ్స్‌ను టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో తొలి స్థానం కైవసం చేసుకోవాలని భావించిన అయ్యర్ సేన ఆశలను అడియాసలు చేస్తూ ఢిల్లీ రెచ్చిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసి న పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా..

లక్ష్యఛేదనలో ఢిల్లీ ఇంకా మూడు బంతులు మిగి లుండగానే 208 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విక్టరీని సొంతం చేసుకుంది. గత మూడు రోజుల నుంచి క్వాలిఫై అయిన జట్ల కు ఎలిమినేట్ అయిన జట్లు షాకిస్తున్నాయి. నేడు గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.