7 May, 2026 | 5:44 AM

ఫుట్ పాత్ లపై ఆక్రమణల తొలగింపు

10-12-2024 06:27 PM

కూకట్ పల్లి (విజయక్రాంతి): రెక్క ఆడితే గాని డొక్కాడని వీధి వ్యాపారస్తులు ఫుట్ ఫాత్ లపై ఉన్న దుకాణాలను జిహెచ్ఎంసి, ట్రాఫిక్ అధికారులు తొలగించడంతో తీవ్ర ఆందోళన గురయ్యారు. మంగళవారం మూసాపేట సర్కిల్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ చౌరస్తా నుండి నెక్సస్ మాల్ వరకు అదేవిధంగా టెంపుల్ బస్ స్టాప్ నుండి బ్రాండ్ ఫ్యాక్టరీ వరకు ఫుట్పాత్లపై ఉన్న షాపులను జెసీబీ సహాయంతో తొలగించారు. దీంతో సదరు విధి వ్యాపారస్తులు కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా తమ సామాను కూడా తీసుకునే సమయం ఇవ్వలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మరోవైపు కేసీఆర్ సారు రావాలి తమకు న్యాయం చేయాలని వీధి వ్యాపారస్తులు పేర్కొంటున్నారు.