01-05-2025 12:38:56 AM
చేవెళ్ల, ఏప్రిల్ 30:ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను మొయినాబాద్ రెవెన్యూ అధికారులు తొలగించారు. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం వద్ద సర్వే నెం. 218లోని సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీనిపై తహసీల్దార్ గౌతమ్ కుమార్ కు ఫిర్యాదు అందడంతో బుధవారం జేసీబీ సాయంతో ఫెన్సింగ్, షెడ్ లను తొలగించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ భూముల రక్షణకు ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల గిర్దవర్ రోజా, రెవెన్యూ సిబ్బంది బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.