05-05-2025 01:56:14 AM
సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
వారణాసి, మే 4: ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) వారణాసిలోని ఆయన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. 1896లో అవిభాజ్య భారత్‌లో జన్మించిన శివానంద 120 ఏండ్లకు పైగా జీవించారు. ఆయన ఆరేండ్ల వయసులో ఉండగానే ఆయ న తల్లిదండులు మృతి చెందారు. దీంతో ఓ ఆశ్రమంలో పెరిగి పెద్దయ్యారు.
చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక త వైపు అడుగులేసిన యోగానంద పెండ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయారు. ఆయన యోగా రం గానికి చేసిన సేవల కుగాను 2022లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.శివానందకు యోగారత్న, బసుంధార రతన్ అవార్డులు కూడా వరించాయి. ఆయన మృతి పట్ల ప్రధా ని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం యోగారంగానికి తీరని లోటన్నారు.