calender_icon.png 5 May, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హౌతీలకు నెతన్యాహూ మాస్ వార్నింగ్

05-05-2025 01:54:30 AM

  1. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరిక
  2. ఇజ్రాయెల్‌పైకి క్షిపణిని ప్రయోగించిన హౌతీలు

టెల్ అవీన్, మే 4: ‘కచ్చితంగా ఎదురుదెబ్బ తీస్తాం. మా మీదే దాడి చేశారుగా.. మా దాడులు మామూలుగా ఉండవు. బాంబుల మోతలకు సిద్ధంగా ఉండండి. ’ అని యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్‌కు ఆదివారం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ మాస్ వార్నింగ్ ఇచ్చా రు. ఇజ్రాయెల్‌పైకి హౌతీలు క్షిపణి దాడి చేసిన అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని హౌతీలను హెచ్చరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఇజ్రాయెల్ లో కీలకమైన బెన్ గురియన్ విమానశ్రయంపైకి హౌతీలు క్షిపణిని ప్రయో గించారు. విమానాశ్రయ ప్రధాన టెర్మినల్ సమీపంలో ఆ క్షిపణి కూలిపోయింది. హమాస్‌ను ఓడించడమే తమ లక్ష్యమని బెంజమిన్ పునరుద్ఘాటించారు. బందీలను వెనక్కి తీసుకొ స్తామన్నారు.